Katti Mahesh: కత్తి మహేశ్ పై కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు!

  • మోదీని హంతకుడితో పోల్చిన కత్తి మహేష్
  • కేసు పెట్టాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
  • కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్న పోలీసులు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ పోలీసులు సినీ విశ్లేషకుడు, తన పదునైన విమర్శలతో నిత్యమూ వార్తల్లో నిలిచే కత్తి మహేశ్ పై కేసు నమోదు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కత్తి మహేశ్ విమర్శించారని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

మోదీని విమర్శిస్తూ చౌకబారు ప్రచారం కోసం మహేశ్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. మోదీని హంతకుడిగా అభివర్ణించిన ఆయనపై కేసు పెట్టాలని రాజాసింగ్ డిమాండ్ చేయగా, దాని ఆధారంగా పోలీసులు కేసు రిజిస్టర్ చేసి విచారణ మొదలు పెట్టారు. కాగా, చట్టం తెలియని ఓ వ్యక్తి, ట్విట్టర్ లో ఫిర్యాదు చేస్తే తనపై కేసేమీ నమోదు కాబోదని నిన్న కత్తి మహేశ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Katti Mahesh
Raja Singh
BJP
Narendra Modi

More Telugu News