America: అమెరికాలో భారత విద్యార్థిపై కాల్పులు.. తీవ్ర గాయాలు

  • అమెరికాలో భారత విద్యార్థిపై కాల్పులు
  • షికాగోలో ఘటన
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
భారతీయ విద్యార్థిపై అమెరికాలో కాల్పులు జరిగాయి. షికాగోలోని డెర్వీ యూనివర్సిటీలో చదువుకుంటున్న మహమ్మద్ అక్బర్ అనే విద్యార్థిపై దుండుగులు కాల్పులు జరిపారు. పార్క్ చేసిన తన కారు వద్దకు వెళ్తుండగా ఒక్కసారిగా అతడిపై కాల్పులు జరిగాయి. షికాగోలోని అల్‌బరీ పార్క్ వద్ద ఈ ఘటన జరిగింది. తీవ్రగాయాలపాలైన అక్బర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, షికాగోలో జరిగిన వీకెండ్ షూటింగ్స్‌లో ఇద్దరు మృతి  చెందగా, 8 మంది గాయపడ్డారు.
America
India
Student
Shot

More Telugu News