టీడీపీ: టీడీపీ డిజిటల్‌ సైన్యం .. వాలంటీర్లు, కార్యకర్తలకు శిక్షణ!

  • నేటి నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
  • నాయకత్వ శిక్షణకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం
  • వచ్చే ఎన్నికల నాటికి లక్ష మంది డిజిటల్ సైన్యం?

సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీ గురించి ప్రచారం చేస్తున్న వాలంటీర్లు, కార్యకర్తలకు నాయకత్వ శిక్షణకు సంబంధించి టీడీపీ ప్రత్యేక కార్యక్రమం అందిస్తోంది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం మంగళగిరి వద్ద ఉన్న ఓ హోటల్ లో జరుగుతోంది. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా ఉండేలా వీరికి శిక్షణ ఇచ్చి డిజిటల్ సైన్యంగా తయారు చేయనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొంటారు. వచ్చే ఎన్నికల నాటికి దాదాపు లక్ష మంది డిజిటల్ సైన్యాన్ని సిద్ధం చేయాలన్నది పార్టీ ఆలోచనగా ఉంది. 

  • Loading...

More Telugu News