నారాయణమూర్తి: ఎక్కడ ఉన్నా తెలుగు మాట్లాడేవారంతా అన్నదమ్ములే!: సినీ నటుడు నారాయణమూర్తి
- తెలుగు భాషకు ప్రాంతీయ, మత భేదాలు లేవు
- అమ్మ భాషను ఆదరించాలి..పరభాషలపై పట్టు సాధించాలి
- ప్రపంచ తెలుగు మహాసభలకు నన్ను ఆహ్వానించడం నా అదృష్టం: నారాయణమూర్తి
ఎక్కడ ఉన్నా తెలుగు మాట్లాడేవారంతా అన్నదమ్ములేనని ప్రముఖ సినీ నటుడు నారాయణమూర్తి అన్నారు. తెలుగు భాషకు ప్రాంతీయ, మత భేదాలు లేవని, అమ్మ భాషను ఆదరించాలని, దీంతోపాటు పరభాషలపై పట్టు సాధించాలని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు తనను ఆహ్వానించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
కాగా, ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం మంచిర్యాల జిల్లాలో నిన్న జరిగింది. ఈ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాగా, ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.