mohan babu: 'అల్లుడుగారు' సినిమాలో ఛాన్స్ వదులుకోవడం నేను చేసిన పొరపాటు: యమున

  • అప్పటివరకూ సోలో హీరోయిన్ గా చేస్తూ వస్తున్నాను 
  • 'అల్లుడు గారు' కోసం అడిగారు
  • పాత్ర నిడివి గురించి ఆలోచించి వదులుకున్నాను
వాస్తవానికి దగ్గరగా వుండే కథలను ఎంచుకుంటూ .. ఎమోషన్ కి ఎక్కువ ప్రాధాన్యత వున్న పాత్రలను యమున చేస్తూ వచ్చారు. తెలిసీ తెలియని తనం వలన కొన్ని మంచి సినిమాలను కూడా వదులుకున్నానంటూ ఆమె ఓ సంఘటనను గురించి ప్రస్తావించారు.

 " అప్పటి వరకూ నేను సోలో హీరోయిన్ గా .. నటనకి ఎక్కువ స్కోప్ వున్న పాత్రలను చేస్తూ వస్తున్నాను. అలాంటి సమయంలో 'అల్లుడు గారు'లో రమ్యకృష్ణ చేసిన పాత్రకోసం ముందుగా నన్ను అడిగారు. ఆ పాత్ర నిడివి గురించి నేను ఆలోచించాను గానీ, రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేస్తే ఎంత హైప్ వస్తుంది .. మోహన్ బాబుతో సినిమా చేయడం వలన ఎంతమంచి పేరు వస్తుంది అనే విషయాలను గురించి నేను ఆలోచించలేదు. అందుకు తగిన వయసు .. గాడ్ ఫాదర్ లేకపోవడమే అందుకు కారణం.  ఆ సినిమా చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ వుంది" అంటూ చెప్పుకొచ్చారు.     
mohan babu
yamuna

More Telugu News