Anushka Sharma: కుటుంబంతో కలసి అనుష్క శర్మ ఇటలీ పయనం... విరాట్ ను వివాహమాడి వస్తుందా...?

  • తల్లిదండ్రులు, సోదరులతో కలసి ప్రయాణం
  • పెళ్లి చేసుకునే వస్తుందంటూ వార్తలు
  • ఖండించిన ఆమె ప్రతినిధి
బాలీవుడ్ కథానాయిక, క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీ ప్రియురాలు అనుష్కశర్మ తన కుటుంబ సభ్యులతో కలసి ఇటలీ బయల్దేరి వెళ్లింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ముంబై విమానాశ్రయంలో తన తల్లిదండ్రులు కల్నల్ అజయ్ కుమార్, ఆశిమా శర్మ, సోదరుడు కర్నేష్ తో కలసి అనుష్క శర్మ వెళుతుండడం మీడియా కెమెరాల కంట్లో పడింది.

 దీంతో అనుష్క పెళ్లి కోసమే ఇటలీకి పయనమైందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డీసెంబర్ రెండో వారంలో అనుష్క, విరాట్ కోహ్లీ ఇటలీలో వివాహం చేసుకోనున్నారంటూ ఇటీవలే రూమర్లు కూడా రావడంతో తాజాగా ఆ సందేహాలు మరింత బలపడుతున్నాయి.

అయితే, ఈ కథనాలను అనుష్క తరఫున అధికార ప్రతినిధి ఖండించారు. వీటిలో ఏ మాత్రం నిజం లేదని, ఇటలీ పర్యటన కేవలం విరామం కోసమేనని స్పష్టం చేశారు. అయితే, డిసెంబర్ 10, 12 మధ్య ఇటలీలో విరాట్, అనుష్క పెళ్లాడనున్నారని, తర్వాత ముంబైలో వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు.
Anushka Sharma
virat kohli

More Telugu News