chiranjeevi: రాకేశ్ శశి దర్శకత్వంలో చిరూ చిన్నల్లుడు కల్యాణ్?

  • నటనలో శిక్షణ తీసుకున్న చిరూ చిన్నల్లుడు 
  • ఆయన కోసం కథా చర్చలు చేస్తోన్న చిరూ - చరణ్ 
  • దర్శకుడిగా రాకేశ్ శశి 
  • నిర్మాతగా సాయి కొర్రపాటి   
చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ ను చూడగానే .. ఇతను కూడా హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన హీరోగా పరిచయం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కొంతకాలం క్రితమే నటన వైపుకు రావాలని ఉందంటూ చిరంజీవికి తన మనసులో మాట చెప్పిన కల్యాణ్, ఆయన సూచన మేరకు నటనలోను .. మార్షల్ ఆర్ట్స్ లోను .. డాన్స్ లోను శిక్షణ తీసుకున్నాడట.

ఈ లోగానే చిరూ .. చరణ్ లు కల్యాణ్ కోసం కథలు వినడం చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలో 'జత కలిసే' చిత్ర దర్శకుడు రాకేశ్ శశితో కథా చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ కథ విషయంలో రాకేశ్ శశి .. చిరంజీవిని ఒప్పించగలిగితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది.  
chiranjeevi
kalyan

More Telugu News