జగన్: జగన్ ని రెండేళ్ల క్రితం కలిశాను.. రెగ్యులర్ గా కలుసుకోం!: హీరో సుమంత్
- వైఎస్ జగన్, తాను క్లాస్ మేట్స్ అని చెప్పిన సుమంత్
- ప్రస్తుతం ఎవరి బిజీలో వాళ్లున్నాం
- రెండేళ్ల క్రితం జగన్ ని కలిశాను: సుమంత్
వైఎస్ జగన్, తాను క్లాస్ మేట్స్ అని చెప్పిన హీరో సుమంత్ ను ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న అడిగారు. ‘ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? తరచుగా ఇద్దరూ కలుస్తుంటారా?’ అనే ప్రశ్నకు సుమంత్ స్పందిస్తూ, ‘పరిస్థితులు మారిపోయాయి. ఎవరి బిజీలో వారు ఉండిపోయాం. రాజకీయాల్లో ఉన్న జగన్ బిజీ అయిపోయారు. రెండేళ్ల క్రితం జగన్ ని కలిశాను. రెగ్యులర్ గా కలుసుకోం..’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా, సుమంత్ నటించిన ‘మళ్లీ రావా’ చిత్రం రేపు విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సుమంత్ సరసన ఆకాంక్ష సింగ్ నటించింది.