తుపాకులగూడెం: తుపాకులగూడెం ఆనకట్ట పనుల విషయమై సీఎం కేసీఆర్ ఆగ్రహం
- ఆనకట్ట పనులు నత్తనడకన సాగుతున్నాయి
- వేగవంతం చేయాలి
- పదిహేను రోజుల్లోగా మళ్లీ పరిశీలిస్తా: కేసీఆర్
తుపాకులగూడెం ఆనకట్ట పనులు నత్తనడకన సాగుతున్నాయంటూ అధికారులపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న ఆనకట్ట పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. ఆనకట్ట పనులు మెల్లగా సాగుతుండటంపై అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదిహేను రోజుల్లోగా మళ్లీ ఇక్కడికి వస్తానని, పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. నిర్దేశించిన విధంగా 2020లోగా ఈ ఆనకట్ట పనులను పూర్తి చేయాలని అన్నారు. కేసీఆర్ వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ వినోద్ కుమార్ ఉన్నారు.