jama masid: ఢిల్లీలోని జామా మసీదు ఒకప్పుడు జమునా దేవి ఆలయం: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- గతంలో తాజ్ మహల్ కూడా హిందూ దేవాలయమన్న వినయ్ ఖతియార్
- దేశంలో 6000ల కట్టడాలను మొఘలులు నాశనం చేశారన్న ఎంపీ
- మండిపడిన ప్రతిపక్షాలు
బీజేపీ ఎంపీ వినయ్ ఖతియార్ మరోసారి భారత చరిత్రకు సంబంధించి కొత్త వ్యాఖ్యలు చేశారు. గతంలో తాజ్ మహల్ ఓ శివాలయమని ప్రకటించిన ఆయన, తాజాగా ఢిల్లీలోని జామా మసీదు కూడా హిందూ దేవాలయమేనని అన్నారు. అది ఒకప్పటి జమున దేవి ఆలయమని, మొఘలులు నాశనం చేసి జామా మసీదు కట్టారని అన్నారు.
అంతేకాకుండా దేశవ్యాప్తంగా దాదాపు 6000లకు పైగా కట్టడాలను మొఘలులు నేలమట్టం చేశారని ఖతియార్ పేర్కొన్నారు. ఖతియార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. వార్తల్లో నిలిచి, ప్రజల దృష్టిని తమవైపుకు తిప్పుకోవడానికి బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాజ్ బబ్బర్ అన్నారు.