polavaram: తప్పు చేయకుంటే ధైర్యంగా పదండి: చంద్రబాబుకు పవన్ సూచన

  • పోలవరం కోసం పోరాడేందుకు సిద్ధం
  • అవకతవకలు లేకుంటే కలసి రండి
  • కొట్లాడి నిధులు తెచ్చుకుందామన్న పవన్
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో ఎటువంటి తప్పు చేయలేదని, అవకతవకలు ఏమీ జరగలేదని చెప్పేట్లయితే, నిధుల కోసం, సకాలంలో ప్రాజెక్టును పూర్తి చేయించడం కోసం పోరాడేందుకు తాను సిద్ధమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పోలవరం వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ఎటువంటి తప్పూ చేయకుంటే చంద్రబాబు ధైర్యంగా ముందడుగు వేయాలని సూచించారు.

సరైన వివరాలను కేంద్రానికి సమర్పించి ఉంటే, ప్రాజెక్టు నిధులను కొట్లాడి తెచ్చుకుందామని చెప్పారు. 2018 నాటికి పోలవరం పూర్తి అయ్యే సూచనలు తనకు కనిపించడం లేదని, అయితే, సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదని, అందుకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదని ఆయన అన్నారు. కేంద్రంతో ధైర్యంగా మాట్లాడి ప్రాజెక్టును పూర్తి చేద్దామని, అందుకోసం ఏపీ సర్కారుకు సహకరించాలని కేంద్రానికి తనవంతు విజ్ఞప్తి చేస్తానని పవన్ వ్యాఖ్యానించారు.
polavaram
Pawan Kalyan
Chandrababu
Telugudesam
Janasena

More Telugu News