Roja: పవర్ స్టార్ కాదు... ప్యాకేజీ స్టార్: రోజా సెన్సేషనల్ కామెంట్స్ వీడియో!
ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైకాపా మహిళా ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ పవర్ స్టారేమీ కాదని, ఆయన ఓ ప్యాకేజీ ఆర్టిస్టని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో పడ్డప్పుడు పవన్ కు ఓ ప్యాకేజీ ఇచ్చి తీసుకువస్తారని, అందువల్లే ఆయన టీడీపీని విమర్శించరని ఆరోపించారు. ఈ మధ్యాహ్నం వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే ముందు వారసత్వ సినిమాల గురించి పవన్ మాట్లాడాలని సలహా ఇచ్చారు. పోలవరం గురించి అసలు పవన్ కల్యాణ్ కు ఏం తెలుసునని రోజా ప్రశ్నించారు. ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టని, ఆయన మనసులో నుంచి వచ్చినదేనని అన్నారు. చంద్రబాబు తన లాభాల కోసం ఈ ప్రాజెక్టును పూర్తి కానీయకుండా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు. గతంలో తాను 9 సంవత్సరాలు అధికారంలో ఉన్న సమయంలో ఏ ఒక్క ప్రాజెక్టునూ చంద్రబాబు పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. విభజన చట్టంలోని హోదా సహా ఎన్నో అంశాలను చంద్రబాబు పక్కన బెట్టారని, ఇది ఆయన చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు.