Pawan Kalyan: పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన పవన్ కల్యాణ్!

  • పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన పవన్ కల్యాణ్
  • ప్రాజెక్టు, పనితీరు, పనుల పురోగతి వివరించిన అధికారులు
  • జిందాబాద్ నినాదాలు చేసిన అభిమానులు
గత పదిరోజులుగా వార్తల్లో నిలిచిన పోలవరం ప్రాజెక్టు సందర్శనకు ప్రముఖ సినీ నటుడు, జనసేనాని పవన్ కల్యాణ్ తొలిసారి వెళ్లారు. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న పవన్ కల్యాణ్ కు ప్రాజెక్టు ఇంజనీర్లు, అధికారులు ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతికి సంబంధించిన వివరాలను చెప్పారు. వ్యూపాయింట్ నుంచి పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన పవన్ కల్యాణ్, ప్రాజెక్టు పనుల వద్దకు వెళ్లనున్నట్టు సమాచారం.

తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించడంతో పరిసర ప్రాంతాల పవన్ అభిమానులు అక్కడికి చేరుకుని భారీ ఎత్తున జిందాబాద్ నినాదాలు చేశారు. వారి నినాదాలు పలుమార్లు ఇబ్బంది పెట్టడంతో వారిని పవన్ కల్యాణ్ వారించారు. కాగా, పోలవరం పనులను పరిశీలిచేందుకు వైఎస్సార్సీపీ నేతలు ఈ మధ్యాహ్నం అక్కడికి వెళ్లనున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయన్న విషయాన్ని వారు పరిశీలించనున్నారు. 
Pawan Kalyan
polaveram
project

More Telugu News