bunny vasu: పవన్ ఫ్యాన్స్! మార్కెట్లో 'కత్తి'లు, 'సుత్తి'లు ఉన్నాయి.. పట్టించుకోకండి!: బన్నీ వాసు

  • పవన్ కల్యాణ్ పై కత్తి మహేష్ విమర్శలు
  • స్పందించిన నిర్మాత బన్నీ వాసు
  • పట్టించుకోవద్దని అభిమానులకు సూచన
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై విశ్లేషకుడు కత్తి మహేష్ మరోసారి విమర్శలు గుప్పించిన వేళ, నిర్మాత బన్నీ వాసు స్పందించాడు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. "పవన్ కల్యాణ్ ఫ్యాన్స్... మార్కెట్ లో 'కత్తి'లు, 'సుత్తి'లు ఉంటాయి. వాటిని పట్టించుకోద్దు" అని అన్నాడు.

నిన్న పవన్ కల్యాణ్ విశాఖలో పర్యటించిన వేళ, తన అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని మోసం చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించగా, కత్తి మహేష్ స్పందించిన సంగతి తెలిసిందే. తన కులాన్ని, ప్రజలను మోసం చేసిన చిరంజీవి సంగతేంటని కత్తి మహేష్ ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
bunny vasu
Pawan Kalyan
Katti Mahesh

More Telugu News