Pawan Kalyan: పవన్‌కు జగన్ కౌంటర్.. చంద్రబాబుకు అవసరమైనప్పుడే ఆయన తెరపైకి వస్తారని వ్యాఖ్య!

  • పవన్‌తో పరిచయం లేదు
  • ఆయన ఇంకా బాబు ప్రభావంలోనే ఉన్నారు
  • ప్రత్యేక హోదా విషయంలో ఇద్దరిదీ ఒకే మాట
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తనపై చేసిన విమర్శలకు వైసీపీ చీప్ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పాదయాత్రకు కొంతసేపు విరామం ఇచ్చిన ఆయన ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. పవన్ కల్యాణ్‌తో తనకు పరిచయం లేదని పేర్కొన్నారు. అయితే ప్రత్యేక హోదా విషయంలో తామిద్దరిదీ ఒకటే మాట అని అన్నారు.

పవన్ ఇంకా చంద్రబాబు ప్రభావంలోనే ఉన్నారని, బాబుకు అవసరమైనప్పుడు పవన్ తెరపైకి వస్తారని విమర్శించారు. పవన్ ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించి ఆయన ప్రభావం నుంచి బయటపడితే మంచిదని సూచించారు. అధికారంలోకి ఎవరు రావాలన్నా ప్రజల దీవెన, దేవుడి ఆశీస్సులు ఉండాలని జగన్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Jagan
Chandrababu

More Telugu News