Pawan Kalyan: రేపు ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు పవన్ కల్యాణ్!
- విశాఖపట్నం పర్యటన ముగించుకున్న జనసేనాని
- రాజమహేంద్రవరం చేరుకున్న పవన్ కల్యాణ్
- రేపు మధ్యాహ్నం జనసేన కార్యకర్తలతో పవన్ భేటీ
విశాఖపట్నం పర్యటనను ముగించుకున్న జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ రాజమహేంద్రవరం చేరుకున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనుల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేపు ఉదయం పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు.
అనంతరం స్థానిక జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై పవన్ తమ కార్యకర్తలకు సూచనలు చేస్తారు. పవన్ కల్యాణ్ విజయనగరంలోనూ పర్యటించే అవకాశం ఉంది.
అనంతరం స్థానిక జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై పవన్ తమ కార్యకర్తలకు సూచనలు చేస్తారు. పవన్ కల్యాణ్ విజయనగరంలోనూ పర్యటించే అవకాశం ఉంది.