Narendra Modi: మోదీ, చంద్ర‌బాబుల పాల‌న అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రుగుతోంది: ర‌ఘువీరారెడ్డి

షార్ట్స్‌లో చూడండి
భార‌త ప్ర‌జాస్వామ్యం ఇంత ప‌టిష్టంగా కొన‌సాగుతోందంటే దానికి కార‌ణం బీఆర్ అంబేద్క‌ర్ చేసిన కృషి ఫ‌లిత‌మేన‌ని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. ఈ రోజు రాజ్యాంగ పితామ‌హుడు అంబేద్క‌ర్ 61వ వ‌ర్థంతి సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో ఆయ‌న‌కు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా ర‌ఘువీరారెడ్డి మాట్లాడుతూ... అంబేద్క‌ర్ ఆశ‌యాల‌ను కొన‌సాగించేందుకు త‌మ పార్టీ కృషి చేస్తుంద‌ని అన్నారు.

 అంబేద్క‌ర్ దళితుల‌కే కాక ఈ దేశ ప్ర‌జ‌లంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌కుడ‌ని అన్నారు. నేటి ప్ర‌ధానమంత్రి మోదీ, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో మైనార్టీలు, బ‌ల‌హీన వ‌ర్గాలు, ద‌ళితులు, ఆదివాసులు, మ‌హిళ‌లు అభ‌ద్ర‌తాభావానికి గుర‌వుతున్నార‌ని విమ‌ర్శించారు. మోదీ, చంద్ర‌బాబు పాల‌న అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌రుగుతోంద‌ని చెప్పారు.
Go Back to Shorts
Narendra Modi
Chandrababu
ambedkar
raghu veera reedy

More Telugu News