shruthi hasan: ప్రియుడు మైఖేల్ కోర్సేల్‌ను తండ్రికి ప‌రిచ‌యం చేసిన శ్రుతి హాస‌న్‌?

  • త‌మిళ న‌టుడు అద‌వ్ పెళ్లికి హాజ‌రైన క‌మ‌ల్ కుటుంబం
  • వారితో పాటు మైఖేల్ కూడా
  • వైర‌ల్ అవుతున్న ఫొటోలు
న‌టి శ్రుతి హాస‌న్‌, త‌న ప్రియుడు మైఖేల్‌ను తండ్రి కమ‌ల్‌కి ప‌రిచ‌యం చేసిందా?... ఈ ఫొటోలు చూస్తే నిజ‌మే అనిపిస్తుంది. వారిద్ద‌రి మధ్య ఏదో న‌డుస్తోంద‌ని కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియా ర‌చ్చ‌చేసేందుకు ప్ర‌య‌త్నిస్తూనే ఉంది. మొన్న‌టికి మొన్న ఆమె త‌ల్లి సారిక‌కి బాయ్‌ఫ్రెండ్‌ను ప‌రిచ‌యం చేసిందంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇవాళ ఏకంగా క‌మ‌ల్ కుటుంబంతో క‌లిసి మైఖేల్ ఓ న‌టుడి పెళ్లికి హాజ‌రు కావ‌డం వారి ర‌చ్చ‌కు మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది.

అవును... లండ‌న్‌కి చెందిన మైఖేల్ కోర్సేల్, పంచె క‌ట్టులో త‌మిళ తంబిలా త‌యారై క‌మ‌ల్ కుటుంబంతో క‌లిసి న‌టుడు అదవ్‌, వినోదినిల వివాహానికి హాజ‌రయ్యారు. అక్క‌డి ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఈ పెళ్లి వేడుకకు రాధిక, ప్రసన్న, ఎ.ఆర్‌. మురుగదాస్‌ తదితర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వారంద‌రికీ కూడా శ్రుతి, మైఖేల్‌ని ప‌రిచ‌యం చేసి ఉంటుంద‌ని గాసిప్ రాయుళ్లు చెవులు కొరుక్కుంటున్నారు.
shruthi hasan
Kamal Haasan
michael corsel
social media
radhika
gossip

More Telugu News