Chiranjeevi: చిరంజీవికి ద్రోహం చేసినవారిని జనసేన ద్వారా దెబ్బ కొడతా: పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్య
- ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత బలం నా పార్టీకి లేదు
- నా పార్టీకి ఖర్చులు పెట్టేవారు కూడా లేరు
- పీఆర్పీలా నా పార్టీని కానివ్వను
- జవాబుదారీ రాజకీయ వ్యవస్థ రావాలి
ప్రజారాజ్యం పార్టీ ఓటమి తనకు బాధ కలిగించిందని, అందుకు కారణమైన ఏ ఒక్కరినీ తాను మర్చిపోలేదని, తన అన్నయ్య చిరంజీవికి ద్రోహం చేసిన వారిని జనసేన ద్వారా దెబ్బకొడదామని జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్య చేశారు. ఈ రోజు విశాఖపట్నంలో జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ మాట్లాడుతూ... ప్రజారాజ్యం పార్టీకి ఉన్నంత బలం తనకు లేదని అన్నారు. పీఆర్పీ లాగే జనసేన కూడా అవుతుందన్న మాట రాకూడదనే తన ప్రయత్నమని చెప్పారు. తన పార్టీకి ఖర్చులు పెట్టేవారు కూడా లేరని అన్నారు.
సమాజం బాగుపడాలన్నదే తన ఆశయమని పవన్ కల్యాణ్ తెలిపారు. రాజకీయాల్లో పరిపూర్ణమైన మంచిని ఆశించలేమని అన్నారు. జవాబుదారీ రాజకీయ వ్యవస్థ రావాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి అవినీతి చేస్తే ప్రజలు కూడా అదే చేస్తారని వ్యాఖ్యానించారు. తనకు కోట్ల మంది జనం అవసరం లేదని అన్నారు. 'స్వామి వివేకానంద చెప్పినట్లు ఉక్కునరాలు, ఇనుప కండరాలు కలిగిన 100 మంది ఉండండి చాలు' అని అన్నారు.