బాబ్రీ మసీదు: బాబ్రీ మసీదును పునర్నిర్మించాలంటూ పోస్టర్లు!

  • యూపీలో పోస్టర్ల కలకలం
  • ‘25 ఏళ్ల విషాద సంఘటనను మరిచిపోవద్దు’ అంటూ రాతలు
  • ఆలయాల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు
బాబ్రీ మసీదును పునర్నించాలంటూ ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. ‘25 ఏళ్ల విషాద సంఘటనను మరిచిపోవద్దు’ అనే అర్థం ఉన్న రాతలు ఆ పోస్టర్లలో ఉండటం కలకలం రేపుతోంది. అల్లర్లు చెలరేగే అకాశం ఉందని పోలీసులు భావిస్తుండటంతో, యూపీలోని పలు పట్టణాల్లో ముఖ్యంగా ఆలయాల వద్ద భద్రత పెంచారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్టు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ పోస్టర్లను పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. యూపీలో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగి నేటికి ఇరవై ఐదేళ్లు అయింది.
బాబ్రీ మసీదు
ఉత్తరప్రదేశ్

More Telugu News