Pawan Kalyan: నాకు ప్రజలు తప్ప పార్టీలతో పని లేదు!: పవన్ కల్యాణ్

  • వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని అడుగుతారు
  • ప్రజా పార్టీతో అని చెబుతాను
  • ప్రజలే నా పార్టీ...కుల, మత, ప్రాంతాలు ఉండవు
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టు కడతారు? అని కొందరు తనను అడుగుతుంటారని పవన్ కల్యాణ్ తెలిపారు. వైజాగ్ లో ఆయన మాట్లాడుతూ, 'ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు?' అని అడిగితే 'ప్రజలే నా పార్టీ అంటాన'ని అన్నారు. తనది ప్రజా పార్టీ అని ఆయన తెలిపారు. ఈ ప్రజా పార్టీకి కులాలు, మతాలు, ప్రాంతాలు ఉండవు అని ఆయన చెప్పారు. సమస్యలే ఉంటాయి. ప్రజల బతుకులే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దీంతో వేదిక హర్షద్వానాలతో మార్మోగింది.

మంచి బతుకులు కోరుకునే ప్రజల పార్టీకే తన సపోర్ట్ తప్ప మరే పార్టీకి కాదని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా ప్రజలకు అండగా నిలబడితే అప్పుడు ఆలోచిస్తానని ఆయన తెలిపారు. లేదంటే మటుకు తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని ఆయన చెప్పారు. గతంలో బీజేపీ తరపున తిరిగాను.. తప్పు చేస్తున్నప్పుడు నిలదీస్తున్నానని ఆయన అన్నారు. 
Pawan Kalyan
Vizag
Andhra Pradesh

More Telugu News