Vishal: కోవింద్, నరేంద్ర మోదీ... చూస్తున్నారా, ఏం జరుగుతోందో?: విశాల్ ఆవేదన

  • విశాల్ ఆశలను నీరుగార్చిన ఈసీ నిర్ణయం
  • జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లేందుకు విశాల్ యత్నం
  • మోదీ, కోవింద్ లను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు
తమిళనాట ఆర్కే నగర్ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన వేళ జరిగిన హై డ్రామా, నటుడు విశాల్ ఆశలను నీరుగార్చగా, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ, జరిగిన విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు హీరో విశాల్.

ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన ఆయన, "ప్రజల నుంచి గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వరకూ నేను అభ్యర్థిస్తున్నాను. నా పేరు విశాల్. చెన్నై ఆర్కే నగర్ ఎన్నికల వేళ, ఏం జరుగుతూ ఉందో మీకందరికీ తెలుసునని భావిస్తున్నాను. నా నామినేషన్ ను తీసుకుని, తిరస్కరించి ఆపై అంగీకరించి, మళ్లీ తిరస్కరించారు. ఇది చాలా దురదృష్టకరం. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. న్యాయం నిలుస్తుందని భావిస్తున్నాను" అని ట్వీట్ చేశారు.
Vishal
RK Nagar
Tamilnadu
Narendra Modi
Ram Nath Kovind

More Telugu News