DCI: పవన్ పరామర్శిస్తున్న వేళ... 'సీఎం డౌన్ డౌన్' అంటూ వెల్లువెత్తిన నినాదాలు

  • డీసీఐ ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తున్న ఉద్యోగులు
  • ఓ ఉద్యోగి ఆత్మహత్య - పరామర్శించిన పవన్
  • సీఎంకు వ్యతిరేకంగా హోరెత్తుతున్న నినాదాలు
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ, ఓ ఉద్యోగి ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబాన్ని పరామర్శించి, నిరసనలు తెలుపుతున్న ఉద్యోగులకు మద్దతు పలికేందుకు జనసేనాని వచ్చిన వేళ, అక్కడికి వచ్చిన ఉద్యోగులు చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు. "సీఎం డౌన్ డౌన్... సీఎం డౌన్ డౌన్" అంటూ నినదించారు.

ప్రభుత్వం తమకు అన్యాయం చేయాలని చూస్తోందని ఆరోపించారు. తమకు మద్దతు తెలిపేందుకు ఏ నేత కూడా ముందుకు రాలేదని విమర్శలు గుప్పించిన వారు, పవన్ కల్యాణ్ రాకతోనైనా తమ కష్టాలు తీరుతాయని ఆశ పడుతున్నామని అన్నారు. పవన్ కల్యాణ్ సైతం, నిరసన వేదికపై కూర్చుని, ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్నారు. మరికాసేపట్లో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
DCI
Vizag
Pawan Kalyan

More Telugu News