Mahesh Babu: మహేశ్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ గిఫ్ట్ .. 'భరత్ అనే నేను' ఫస్టులుక్ రిలీజ్ డేట్!

షార్ట్స్‌లో చూడండి
కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' సినిమా తెరకెక్కుతోంది. హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తిచేసిన ఈ సినిమా, తదుపరి షెడ్యూల్ ను తమిళనాడులో జరుపుకోనుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 'కారైకుడి'లో చిత్రీకరించనున్నారు.

 ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తితో మహేశ్ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి ఫస్టులుక్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అభిమానుల కోసం మహేశ్ బాబు ఇవ్వనున్న న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేననే టాక్ వినిపిస్తోంది. మహేశ్ బాబు జోడీగా కైరా అద్వాని నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొరటాల .. మహేశ్ బాబు కలిసి మరోసారి హిట్ కొట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.         
Go Back to Shorts
Mahesh Babu
kiara adwani

More Telugu News