Pawan Kalyan: నేడు ప్రభుత్వానికి మరిన్ని ప్రశ్నలు... విశాఖ చేరుకున్న పవన్ కల్యాణ్!

  • విశాఖపట్నం చేరుకున్న పవన్ కల్యాణ్
  • ఘనస్వాగతం పలికిన అభిమానులు
  • ఆత్మహత్య చేసుకున్న డీసీఐ ఉద్యోగి కుటుంబానికి పరామర్శ
తమకు న్యాయం చేయాలంటూ డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపడంతో పాటు, ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి వెంకటేశ్‌ కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. డీసీఐ ప్రైవేటీకరణను నిరసిస్తూ, వెంకటేష్ అత్మహత్య చేసుకోగా, ఉద్యోగులు ఆందోళన ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలదేనని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన, సమస్యలపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీస్తానని తెలిపారు. ఈ సాయంత్రం విశాఖ నుంచి వచ్చి, కృష్ణానది పడవ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను కూడా పవన్ పరామర్శించనున్నారు. యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సాధించుకోవాలని, అందుకు జనసేన అండగా ఉంటుందని ఆయన నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పవన్ చేపట్టిన ఈ యాత్రకు తన 'జల్సా'లోని సూపర్ హిట్ సాంగ్ 'చలోరే చలోరే చల్' అని పేరు పెట్టిన పవన్, పారదర్శకత నిండిన బాధ్యతాయుత పాలన కోసమే ఈ కార్యక్రమం చేస్తున్నట్టు ప్రకటించారు.
Pawan Kalyan
Janasena
Vizag
DCI

More Telugu News