హైదరాబాద్: హైదరాబాద్ పరిసర జిల్లాల్లో 24 లక్షలకు పైగా ఓట్లు తొలగింపు
- రాష్ట్ర ఇన్ చార్జ్ ఎన్నికల ప్రధాన అధికారి అనూప్ సింగ్ వెల్లడి
- ప్రయోగాత్మకంగా 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికి సర్వే
- కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 5,82,138
హైదరాబాద్ పరిసర జిల్లాల్లో 24 లక్షలకు పైగా ఓట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం తొలగించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఇన్ చార్జ్ ఎన్నికల ప్రధాన అధికారి అనూప్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా 36 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికి సర్వే నిర్వహించినట్టు చెప్పారు.
ఓటర్ల జాబితాను అనుసరించి జీహెచ్ఎంసీలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, రాష్ట్రంలోని కొన్ని ఇతర నియోజకవర్గాలలో ఇంటింటి సర్వే నిర్వహించినట్టు చెప్పారు. వివిధ కారణాలతో 24, 20, 244 ఓట్లను తొలగించగా, కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య 5,82,138 అని చెప్పారు. కొత్త జాబితాపై నవంబర్ 27న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చామని, దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 27 లోపు తెలియజేయాలని కోరారు.