rakhi sawant: టీవీ యాంకర్ భార‌తీ, హ‌ర్ష్‌ల‌ పెళ్లి వేడుక‌లో రాఖీ సావంత్ నాగిని డ్యాన్స్‌... వీడియో ఇదిగో!

  • గోవాలో ఘ‌నంగా జ‌రిగిన పెళ్లి
  • హాజ‌రైన టీవీ సెల‌బ్రిటీలు
  • సోష‌ల్ మీడియా నిండా వారి ఫొటోలే
హిందీ టెలివిజ‌న్ ఇండ‌స్ట్రీలో పేరుగాంచిన క‌మెడియ‌న్‌, యాంక‌ర్ భార‌తి, త‌న బాయ్‌ఫ్రెండ్ హర్ష్ లింబాచియాల వివాహం ఇటీవ‌ల గోవాలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహానికి దాదాపు అంద‌రు టీవీ సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. అక్క‌డ వారు దిగిన సెల్ఫీలు, చేసిన అల్ల‌రి ఫొటోలు, వీడియోల‌తో సోష‌ల్ మీడియా నిండిపోయింది.

అయితే వాట‌న్నింటిలోనూ బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్ చేసిన నాగిని డ్యాన్స్ వీడియో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఢోల్ వాయింపుల‌కు రాఖీ మోకాళ్ల మీద కూర్చుని వేసిన స్టెప్పుల వీడియో వైర‌ల్‌గా మారింది. వీడియో కొద్దిసేపే ఉన్న‌ప్ప‌టికీ ఆ పెళ్లికి హాజ‌రైన‌వారు చేసిన అల్ల‌రి, ఎంజాయ్‌మెంట్‌ను ప్ర‌తిబింబిస్తోంది.
rakhi sawant
bharti
harsh
naagin dance
video
goa
marriage

More Telugu News