Sailaja: శాడిస్ట్ భర్త రాజేష్ కు పటుత్వ పరీక్షలు!

  • తొలిరాత్రి భార్యను హింసించిన రాజేష్
  • పటుత్వ పరీక్షల కోసం కోర్టును ఆశ్రయించనున్న పోలీసులు
  • నేడు పిటిషన్ దాఖలు చేసే అవకాశం
  • మెరుగు పడుతున్న శైలజ ఆరోగ్యం
తాను సంసార సుఖానికి పనికిరానని తెలిసి కూడా పెళ్లి చేసుకోవడమే కాకుండా, తొలిరాత్రి భార్యకు నరకం చూపించిన శాడిస్ట్ భర్త రాజేష్ కు పటుత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు. ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజేష్ కు పటుత్వ పరీక్షలు జరిపేందుకు నిర్ణయించిన చిత్తూరు జిల్లా పోలీసులు, అందుకు అనుమతి కోసం నేడు మూడో అదనపు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

కోర్టు అనుమతి తీసుకుని రాజేష్ కు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, అతనికి మగతనం లేదని తేలితే, ఐపీసీలోని మరికొన్ని సెక్షన్లను అతనిపై జోడిస్తామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. కాగా, రాజేష్ చేతిలో చావు దెబ్బలు తిన్న శైలజ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, ఆమెను త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు.
Sailaja
Rajesh
Chittore Dist
First Night

More Telugu News