vijay malya: ఒక్క గిఫ్టుతో ఆ ఊళ్లో హీరోగా మారిన విజయ్ మాల్యా!

  • లండన్ లోని టెవిన్ అనే గ్రామంలో విజయ్ మాల్యా మకాం
  • ఆ గ్రామంలో రెండు వేల మంది నివాసం
  • గ్రామ వాసులకు 20 లక్షల విలువైన క్రిస్మస్ ట్రీని బహూకరించిన మాల్యా
మాజీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా 9 వేల కోట్లు బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్ కు చెక్కేసిన సంగతి తెలిసిందే. లండన్ శివారులోని టెవిన్ అనే గ్రామంలో ఆయన వుంటున్నారు. ఆ గ్రామంలో సుమారు రెండువేల మంది నివసిస్తున్నారు. లండన్ లో ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామం మొత్తాన్ని ఆనందంలో ముంచెత్తుతూ విజయ్ మాల్యా 20 లక్షల రూపాయల విలువ చేసే క్రిస్మస్ ట్రీని ఆ గ్రామానికి బహుమతిగా అందజేశారు.

దీంతో ఆయనంటే టెవిన్ గ్రామస్థులకు ఎనలేని గౌరవం ఏర్పడింది. ఆయన గొప్ప ధనవంతుడని, ఎంతో గొప్పవాడని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మాల్యాను తమ దేశం నుంచి తీసుకెళ్లవద్దని ముక్తకంఠంతో కోరుతున్నారు. మాల్యా తమ గ్రామానికి గొప్ప ఆస్తి లాంటివాడని పేర్కొంటున్న ఆ గ్రామవాసులు, మాల్యా ప్రస్తుతం సమస్యల్లో ఉన్నారని, ధనవంతులకు ఇలాంటి సమస్యలు సాధారణమని పేర్కొంటుండడం విశేషం. 
vijay malya
London
tevin village
christmas tree
gift

More Telugu News