nannapaneni rajakumari: శైలజపై దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలి: న‌న్న‌ప‌నేని

  • చిత్తూరు జిల్లా మోతరంగనపల్లిలో భార్య‌పై దారుణానికి పాల్ప‌డ్డ‌ భ‌ర్త
  • బాధితురాలు శైల‌జ‌ను ప‌రామ‌ర్శించిన న‌న్న‌ప‌నేని  
  • ఘటన వివ‌రాల సేక‌రణ ‌
  • ఈ ఘ‌ట‌న‌పై రాష్ట్ర స‌ర్కారుకి నివేదిక ఇస్తాం
చిత్తూరు జిల్లా మోతరంగనపల్లిలో రాజేష్ అనే ఓ టీచ‌ర్ త‌న‌కు పెళ్లి జ‌రిగిన కొన్ని గంట‌ల‌కే త‌న భార్య‌ శైలజను గొడ్డును బాదిన‌ట్లు బాదిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమెకు  తిరుపతిలోని స్విమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స జ‌రుగుతోంది. బాధితురాలిని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని, ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా న‌న్న‌ప‌నేని రాజకుమారి మీడియాతో మాట్లాడుతూ.. శైల‌జ‌ భర్త రాజేష్‌పై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై తాము రాష్ట్ర స‌ర్కారుకి నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. శైల‌జ‌కు అండగా ఉంటామని ప్ర‌క‌టించారు.
nannapaneni rajakumari
chittoor
rajesh
shailaja

More Telugu News