somu veerraju: చంద్రబాబు మీద పూర్తి విశ్వాసం ఉంది: సోము వీర్రాజు

  • చంద్రబాబు తీసేసుకోండంటే తీసేసుకుంటామా?
  • బీజేపీతో కలిసి పోలవరం ప్రాజెక్టును బాబే పూర్తి చేస్తారు
  •  పోలవరం ప్రాజెక్టు రాజకీయాలకతీతమైనది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. పోలవరంపై ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు కోపంతో పోలవరం పూర్తిచెయ్యం తీసేసుకోండి అంటే తీసేసుకుంటామా? అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబునాయుడు సారధ్యంలో బీజేపీ పూర్తి చేస్తుందని ఆయన చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు బీజేపీ కృతనిశ్చయంతో ఉందని ఆయన తెలిపారు. అందుకే ఏడు మండలాలను ఏపీలో కలిపామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రాజకీయాలకు అతీతమైనదని ఆయన పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్ గురించి అప్పుడే ఏమీ మాట్లాడలేమని ఆయన తెలిపారు. కాపు రిజర్వేషన్ పార్లమెంటులో ప్రవేశపెట్టడం గురించి చర్చిస్తామని ఆయన చెప్పారు. కాపు రిజర్వేషన్ గురించి అప్పుడే వ్యాఖ్యానించడం సరికాదని ఆయన తెలిపారు. దీనిపై కాలమే చెబుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్ తంతును పూర్తి చేసి, బీజేపీపై తోసేసేందుకు కేంద్రం వద్దకు బిల్లును పంపుతోందా? లేదా? కాపు రిజర్వేషన్ కార్యరూపం దాల్చుతుందా? లేదా? అన్నవాటిని కాలమే తేల్చుతుందని ఆయన పేర్కొన్నారు. 
somu veerraju
BJP
Andhra Pradesh

More Telugu News