హరనాథ్ కి నేనంటే భయం .. ఒకసారి తాగేసి షూటింగుకి వచ్చాడు : జమున
- హరనాథ్ తో మంచి హిట్లు పడ్డాయి
- మా కాంబినేషన్ కి మంచి పేరు వచ్చింది
- అయినా ఆయనతో చేయనని చెప్పడానికి కారణం అదే
"మా కాంబినేషన్లో మంచి సినిమాలు పడ్డాయి .. ఒక స్టేజ్ కి వచ్చేసరికి హరనాథ్ తో నేను చేయనని చెప్పేశాను. ఆయనతో చేయాలంటే విసుగొచ్చేసింది. నేనంటే ఆయనకి భయం .. నాతో షూటింగ్ వుంటే తాగేవాడు కాదు. ఒక రోజున ఉదయం సెట్లో నేను లేననుకుని తాగేసి వచ్చాడు. దాంతో ఇక ఆయనతో చేయనని చెప్పేశాను. ఆయనకి మత్తు దిగిన తరువాత మధ్యాహ్నం షూటింగ్ చేయమని డైరెక్టర్ తో అన్నాను. షూటింగ్ చివరిరోజు కావడం వలన అలాగే కానిచ్చేశారు. ఆ తరువాత నుంచి ఆయనతో సినిమాలు చేయలేదు" అంటూ చెప్పుకొచ్చారు.