lizi: 25 ఏళ్ల తరువాత పవన్, త్రివిక్రమ్ సినిమాతో తెరపైకి వచ్చిన నాటి అందాల తార లిజి!

  • 1990 దశకంలో సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు
  • పాతికేళ్ల తరువాత తిరిగి కెమెరా ముందుకు
  • నితిన్ హీరోగా పవన్, త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్న లిజి
లిజి... ఈ పేరు గుర్తుందా? రాజశేఖర్ కెరీర్ ను మలుపుతిప్పిన సూపర్ హిట్ చిత్రం 'మగాడు', సుమన్ హీరోగా నటించిన '20వ శతాబ్దం' వంటి 1990 దశకంలో వచ్చిన చిత్రాలలో నటించింది. తెలుగులో ఆమె నటించింది 8 సినిమాలే అయినా, అందులో ఆరు హిట్స్ కొట్టి, కెరీర్ బాగున్నప్పుడే దర్శకుడు ప్రియదర్శన్ ను వివాహం చేసుకుని నటనకు దూరమైన నటి. తిరిగి ఇప్పుడు 25 సంవత్సరాల తరువాత ముఖానికి మేకప్ వేసుకున్నారు.

ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ పేజీలో వెల్లడించిన లిజి, పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలసి నిర్మిస్తున్న చిత్రంలో తాను నటిస్తున్నానని చెప్పింది. 2018లో తెరపైకి వచ్చే సినిమా తొలి షెడ్యూల్ ను అమెరికాలో పూర్తి చేశామని, ఇందులో నితిన్ హీరో అని వెల్లడించింది. అప్పట్లో అయిష్టంగానే పరిశ్రమను వదిలి వెళ్లానని, ఇంత కాలం కెమెరాకు దూరమైనా, తనకేమీ ఇబ్బంది అనిపించలేదని చెప్పుకొచ్చింది. తనకు ఎక్కువ అవకాశాలు ఇచ్చిన మలయాళంలోనూ మళ్లీ నటిస్తానని పేర్కొంది.
lizi
Facebook
Pawan Kalyan
Trivikram

More Telugu News