abburi ravi: త్రివిక్రమ్ ఇప్పుడు చేస్తోన్న సినిమాలన్నీ త్వరలో ఆయన చేయనున్న సినిమాలకి ట్రైలర్స్ లాంటివి: అబ్బూరి రవి

  • త్రివిక్రమ్ మంచి రైటర్
  • అంతకి మించిన దర్శకుడు 
  • ఆయన ఇంకా గొప్పగా సినిమాలు చేయగలడు
  • ఆ నమ్మకం నాకుంది       
రచయిత అబ్బూరి రవిని తెలుగు చిత్ర పరిశ్రమకి తీసుకు వచ్చింది త్రివిక్రమ్. ఇద్దరూ క్లాస్ మేట్స్ కావడం వలన వాళ్ల మధ్య మంచి స్నేహం ఉండటమే అందుకు కారణం." త్రివిక్రమ్ లోని రైటర్ ని ఎక్కువగా ఇష్ట పడతారా? .. ఆయనలోని దర్శకుడిని ఎక్కువగా ఇష్ట పడతారా?" అనే ప్రశ్న ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో అబ్బూరి రవికి ఎదురైంది.

 అందుకాయన స్పందిస్తూ .. "త్రివిక్రమ్ లోని రైటర్ .. డైరెక్టర్ ఇద్దరూ గొప్పవాళ్లే. ఎందుకంటే ఆయన చదువు వేరు .. ఆయన పరిశీలనా శక్తి వేరు .. ఆయనకి గల అవగాహన శక్తి వేరు .. ఆయన కెపాసిటీ వేరు. ఇప్పుడు తాను చేస్తోన్న సినిమాలకి దాదాపు 100 శాతం బెటర్ గా ఆయన సినిమాలు చేయగలడు. ఆయన ఆ స్థాయికి వెళతాడనే నమ్మకం నాకుంది. ఆయనకి గల ప్రతిభను బట్టి చూస్తే .. ఇప్పుడు ఆయన చేస్తోన్న సినిమాలన్నీ త్వరలో ఆయన చేయనున్న సినిమాలకు ట్రైలర్స్ లాంటివనేది నా అభిప్రాయం" అని చెప్పుకొచ్చారు.      
abburi ravi
trivikram

More Telugu News