saidharam tej: నన్ను చూసి మా అమ్మ భయపడిపోయింది: సాయిధరమ్ తేజ్

  • చదువు పూర్తికాగానే ఉద్యోగం చేయాలనుకున్నాను 
  • 9-5 జాబ్ చేయడం నా వలన కాదనిపించింది 
  • అప్పుడే సినిమాలపై దృష్టి పెట్టాను
మాస్ హీరోగా సాయిధరమ్ తేజ్ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో క్రేజీ ప్రాజెక్టులు వున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ .. గతంలో జరిగిన ఒక సంఘటనను గురించి ప్రస్తావించాడు. " నేను ఎంబీఏ పూర్తి చేసిన తరువాత ఎక్కడైనా ఉద్యోగం చేయాలనుకున్నాను. అప్పటికింకా సినిమాలపై దృష్టి పెట్టలేదు. అందువలన ఉద్యోగంలో చేరాలనుకున్నాను.

 ఓ రోజున మా ఫ్రెండ్ వాళ్ల ఆఫీస్ కి వెళ్లాను. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒక పరిధిలో ఉద్యోగం చేయడం నా వల్ల కాదనిపించింది. దాంతో నేనేం చేయాలో తెలియని అయోమయానికి లోనై జ్వరం తెచ్చేసుకున్నాను. నేను మరీ వీక్ గా అయిపోవడం చూసి .. డ్రగ్స్ కి ఏమైనా అలవాటు పడిపోయానేమోనని మా అమ్మ భయపడిపోయింది. ఆ సమయంలోనే కొత్తగా ఏదైనా చేయాలనుకున్న నేను సినిమాలపై దృష్టి పెట్టాను. చిరంజీవి మావయ్య నా చదువు విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నాడో .. పవన్ మావయ్య నేను సినిమాల్లోకి రావడానికి అంత కేర్ తీసుకున్నాడు" అని సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. 
saidharam tej

More Telugu News