Cricket: డబుల్ సెంచరీ దిశగా కోహ్లీ... మురళీ విజయ్, రహానే అవుట్

  • 150 పరుగులు దాటిన కోహ్లీ
  • 155 పరుగుల వద్ద పుజారా అవుట్
  • 167 పరుగుల వ్యక్తిగత స్కోరు దాటకపోవడంతో నిరాశ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరోసారి డబుల్ సెంచరీ సాధించే దిశగా పరుగులు తీస్తున్నాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఛటేశ్వర్ పుజారా అవుటైన అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ 52 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం అతను సెంచరీ చేసేందుకు మరో 58 బంతులు అవసరమయ్యాయి. అనంతరం 178 బంతుల్లో 150 పరుగులు చేశాడు.

 కోహ్లీ ఆ మైలు రాయి సాధించిన వెంటనే మురళీ విజయ్ 155 పరుగుల వద్ద స్టంప్ అవుట్ గా వెనుదిరిగాడు. దీంతో నిరాశచెందాడు. తన వ్యక్తిగత అత్యధిక స్కోరు 167 మార్కు దాటాలని భావించిన విజయ్ అంతకంటే ముందే పెవిలియన్ చేరడంతో నిరాశ చెందాడు. దీంతో 87 ఓవర్లలో టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 365 పరుగులు చేసింది. కోహ్లీకి అజింక్యా రహానే జతకలిశాడు. వెంటనే మురళీ విజయ్ తరహాలోనే స్టంపౌట్ అయ్యాడు. దీంతో కోహ్లీకి రోహిత్ శర్మ జతకలిశాడు. 
Cricket
Virat Kohli
Murali Vijay
team india

More Telugu News