3rd test: దూకుడు మీదున్న భారత్.. మురళీ హాఫ్ సెంచరీ!

  • తొలి సెషన్ లో 116 పరుగులు
  • 16వ హాఫ్ సెంచరీ చేసిన మురళీ విజయ్
  • 23 పరుగులకు ఔటైన పుజారా
ఢిల్లీలో శ్రీలంకతో జరగుతున్న మూడో టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ (51) నమోదు చేశాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 16వ అర్ధశతకాన్ని సాధించాడు. మరోవైపు, 17 పరుగులతో కెప్టెన్ కోహ్లీ ఆడుతున్నాడు. అంతకు ముందు మరో ఓపెనర్ ధవన్ 23 పరుగులకు ఔట్ కాగా... వన్ డౌన్ బ్యాట్స్ మెన్ పుజారా కూడా 23 పరుగులకే పెవిలియన్ చేరాడు. గమగే బౌలింగ్ లో సమరవిక్రమకు క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. టీమిండియా ప్రస్తుత స్కోరు 2 వికెట్ల నష్టానికి 116 పరుగులు. 
3rd test
india vs sri lanka
murali vijay

More Telugu News