లవ్ జిహాద్‌కు కౌంటర్.. హిందూ యువకులతో ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లకు ఆరెస్సెస్ అనుబంధ సంస్థ రెడీ.. 2 వేల పెళ్లిళ్లకు ముహూర్తం!
- ముస్లిం కోడళ్లను ఇంటికి తీసుకురావాలంటూ స్లోగన్
- పెళ్లిళ్ల ఖర్చును భరించి రక్షణ కల్పించనున్న హెచ్‌జేఎం
- వారికి వారి భాషలోనే సమాధానం చెబుతామని హెచ్చరిక
హిందూ యువకులను వివాహం చేసుకోవాలని భావించే ముస్లిం యువతులకు అండగా నిలిచి, వారికి రక్షణ కల్పించి వివాహాలు చేయనుంది. మొత్తంగా 2100 ముస్లిం యువతుల వివాహాలు జరిపించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం అవసరమైన ఆర్థిక సాయం కూడా అందించనుంది.
‘‘వారికి వారి భాషలోనే సమాధానం చెబుతాం’’ అని హెచ్‌జేఎం రాష్ట్ర చీఫ్ అజ్జు చౌహాన్ తెలిపారు. మతాంతర వివాహాల వల్ల జనాభాను నియంత్రించడం కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ‘లవ్ జిహాద్’ను ఆపకుంటే ముస్లిం యువతులను ఆకర్షించేందుకు బజరంగ్ దళ్ యువకులను పంపించాల్సి ఉంటుందని ఇటీవల విశ్వహిందూ పరిషత్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.