somisetty venkateswarlu: జగన్ ను రాళ్లతో కొట్టండి.. ఆయనొక పెద్ద పందికొక్కు: టీడీపీ నేత సోమిశెట్టి
- కేంద్రానికి రహస్యంగా లేఖలు రాస్తున్నారు
- పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు
- జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవు
వైసీపీ అధినేత జగన్ పై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు జగనే ప్రధాన అడ్డంకి అని ఆయన మండిపడ్డారు. కేంద్రానికి రహస్యంగా లేఖలు రాస్తూ, పోలవరం ప్రాజెక్టును అడ్డుకుంటున్న జగన్ ను రాళ్లతో కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కుర్చీ కోసం కలలు కంటూ, ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పిస్తూ, పాదయాత్రను కొనసాగిస్తున్నాడంటూ విమర్శించారు. ఎమ్మెల్యేలను జగన్ పందికొక్కులు అంటున్నాడని... వారికి టికెట్లు ఇచ్చిన జగన్ పెద్ద పందికొక్కు అని అన్నారు.
జగన్ కు బీసీలంటే గౌరవం లేదని... పాదయాత్రలో వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని సోమిశెట్టి చెప్పారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య గురించి పదేపదే మాట్లాడుతున్న జగన్... బీసీ కులానికి చెందిన సోమన్న అదృశ్యం గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్ ఎప్పటికీ సీఎం కాలేరని... 2019లో ఆయనకు రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు. జగన్ కు నాయకత్వ లక్షణాలు లేవని ఎద్దేవా చేశారు. సొంత చానల్, సొంత పేపర్లో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ, రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.