నెత్తురోడిన పాకిస్థాన్.. సైన్యంపై మండిపడ్డ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేత కుమార్తె
- పెషావర్ లో ఉగ్రదాడి
- 12 మంది మృతి
- సైన్యం తీరుపై మండిపడ్డ ఇమాన్ మజారీ
ఈ ఘటన అనంతరం ప్రముఖ రాజకీయ నేత తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నాయకుడు షిరీన్ మజారీ కుమార్తె ఇమాన్ మజారీ పాక్ సైన్యంపై మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండటం పట్ల సైన్యం సిగ్గుపడాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు నిధులు అందిస్తున్న ఆర్మీ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు. టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తే, చివరకు పాకిస్థానే నాశనం అవుతుందనే విషయం ఇప్పటికీ సైన్యానికి అర్థం కావడం లేదని మండిపడ్డారు. అయితే ఈ వ్యాఖ్యలను ఆమె తండ్రి ఖండించడం గమనార్హం.