Chandrababu: రేపు రాత్రి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు.. పోలవరంపై కేంద్ర మంత్రులతో భేటీ!

  • సోమవారం జైట్లీ, గడ్కరీలతో భేటీ
  • పోలవరంపై చర్చ
  • ఏపీలో ప్రకంపనలు రేపుతున్న కేంద్రం లేఖ
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర అధికారులు రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ నేతలైతే ఏకంగా బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

మరోవైపు, ప్రతిపక్ష నేత జగన్ టీడీపీపై ఎదురుదాడి ప్రారంభించారు. పోలవరం సకాలంలో పూర్తి కాకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఆయన దుయ్యబడుతున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్రంతో పోలవరంపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారు. రేపు రాత్రి ఆయన ఢిల్లీ బయల్దేరనున్నారు. సోమవారంనాడు ఆయన కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలతో సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించి వీరితో చర్చించనున్నారు. 
Chandrababu
nitin gadkari
Arun Jaitly
polavaram project

More Telugu News