kapu resarvations: కాపు రిజర్వేషన్ ఎఫెక్ట్: మంత్రులు నారాయణ, గంటా ముఖాల్లో సంతోషం!

  • రేపు ఉదయం 8 గంటలకు కేబినెట్ భేటీ
  • కాపు రిజర్వేషన్ పై అసెంబ్లీలో ప్రకటన
  • అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారిక ప్రకటనలు సభ బయట చేయరాదు
కాపు రిజర్వేషన్ పై రేపు ఉదయం కూడా చర్చించాల్సి ఉందని ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కాపు రిజర్వేషన్ లపై అధికారిక ప్రకటన చేయడం చట్టసమ్మతం కాదని అన్నారు. రేపు ఉదయం 8 గంటలకు మరోసారి కేబినెట్ భేటీ జరగనుందని, ఆ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

మంజునాథ కమీషన్ సిఫారసులపై మరోసారి చర్చ జరిగిన అనంతరం అసెంబ్లీలో దీనిపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుల ముఖాల్లో ఆనందం తాండవించడంతో కాపు రిజర్వేషన్లపై పూర్తి స్థాయి నిర్ణయం జరిగిపోయిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. 
kapu resarvations
Andhra Pradesh
cabinet meeting

More Telugu News