somu veerraju: చంద్రబాబుకు తెలియకుండానే విమర్శిస్తారా?.. టీడీపీతో దోస్తీని దైవమే నిర్ణయిస్తుంది: సోమూ వీర్రాజు

  • పోలవరంపై టీడీపీది అనవసర రాద్ధాంతం
  • చంద్రబాబుకు తెలియకుండానే విమర్శిస్తారనుకోను
  • పోలవరంను కేంద్రమే నిర్మిస్తుంది
పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ నేతలు అనవసర రాద్దాంతం చేస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. బీజేపీని విమర్శిస్తున్నారని... ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియకుండానే బీజేపీ నేతలను టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని తాను భావించడం లేదని ఆయన అన్నారు. బీజేపీపై బురదచల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని సూచించారు. 2019లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ దోస్తీ కొనసాగుతుందా? లేదా? అనేది దైవమే నిర్ణయిస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుందని అన్నారు.  
somu veerraju
ap bjp
Telugudesam
polavaram project

More Telugu News