raghuveera reddy: పోలవరం పంపకాల్లో తేడాలు రావడంతోనే రచ్చ జరుగుతోంది: రఘువీరా

  • పంపకాల్లో టీడీపీ, బీజేపీ మధ్య తేడాలు
  • ఈ కారణంగానే ఇరు పార్టీలు వీధిన పడ్డాయి
  • ప్రాజెక్టును పూర్తి చేయడంపై చిత్తశుద్ధి లేదు
పోలవరం ప్రాజెక్టు పనుల కమిషన్ల పంపకాల్లో తేడాలు వచ్చాయని... అందుకే బీజేపీ, టీడీపీ నేతల మధ్య విభేదాలు వచ్చాయని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ఈ కారణంగా ఇరు పార్టీలు వీధిన పడ్డాయని ఎద్దేవా చేశారు. పోలవరంను గోలవరంగా మార్చేశారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ పేరును తొలగించడానికి ఉన్న ఆత్రుత... ప్రాజెక్టును పూర్తి చేయాలనే దానిపై ఇరు పార్టీలకు లేదని మండిపడ్డారు. అంచనాలను భారీగా పెంచినా ఎన్నికల్లోపు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదని అన్నారు. 
raghuveera reddy
apcc
polavaram project

More Telugu News