polavaram: అడ్డగోలుగా వ్యవహరిస్తే అందరూ జైలుకే... పోలవరంపై బీజేపీ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్య!

  • ప్రాజెక్టుపై ముదిరిన మాటల యుద్ధం
  • అధికారులను పావులుగా మారుస్తున్నారు
  • ప్రస్తుతానికి కాంట్రాక్టులు ఆపాల్సిందే
  • బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు
ఆంధ్రప్రదేశ్ కు వరదాయినిగా మారుతుందని భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ, టీడీపీల మధ్య మాటల యుద్ధం మరింతగా ముదిరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలవరం గుత్తేదారులను మార్చేందుకు అంగీకరించేది లేదని బీజేపీ తేల్చి చెప్పింది. అడ్డగోలుగా వ్యవహరిస్తూ కొత్త కాంట్రాక్టర్లను పిలిస్తే, అధికారులంతా జైలుకు వెళ్లాల్సి వస్తుందని బీజేపీ సీనియర్ నేత రఘునాథబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు సహా ఎవరి పేరూ చెప్పకుండా, టీడీపీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రం సంకల్పంతో ఉన్నా, కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన డిబేట్ లో పాల్గొన్న ఆయన, ప్రస్తుతానికి కాంట్రాక్టులను ఆపాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, టీడీపీ సర్కారు పలువురు అధికారులను పావులుగా మారుస్తోందని రఘునాథబాబు విమర్శించారు.
polavaram
BJP
Telugudesam
Raghunathbabu

More Telugu News