vishnu kumar raju: పోల‌వ‌రం ప్రాజెక్టు ఆగ‌దు: విష్ణుకుమార్ రాజు

షార్ట్స్‌లో చూడండి
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే టెండర్లు నిలిపి వేయాలని కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన నేప‌థ్యంలో దానిపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోల‌వ‌రం ప్రాజెక్టు ఆగ‌దని స్ప‌ష్టం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై వ‌చ్చిన లేఖ‌పై ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

కేంద్ర ప్ర‌భుత్వానికి స‌రైన స‌మాధానం పంపితే తేలిక‌గా స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు పూర్తి చేసేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని చెప్పారు. పోల‌వ‌రం ప‌నుల‌పై ఎవ్వ‌రూ సందేహాలు పెట్టుకోవ‌ద్ద‌ని చెప్పారు.
Go Back to Shorts
vishnu kumar raju
polavaram
Chandrababu

More Telugu News