Andhra Pradesh: చంద్రబాబు అలా ఎందుకన్నారో తెలియదు.. మిత్రపక్షంగా అన్నీ చేస్తున్నాం: సోము వీర్రాజు

  • అధికారి రాసిన లేఖకు అలా స్పందించాల్సిన అవసరం లేదు
  • మిత్రపక్షంగా పూర్తి సహాయం చేస్తున్నాం 
  • ఆ లేఖపై నా వద్ద పూర్తి సమాచారం లేదు 
పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఆపేయమంటే ఆపేస్తామని చంద్రబాబునాయుడు ఎందుకు అన్నారో తనకు తెలియదని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. ఒక టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఒక అధికారి రాసిన లేఖకు ముఖ్యమంత్రి అలా స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ లేఖను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాసి ఉంటే సీఎం అలా స్పందించాల్సిందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాభివృద్ధికి అన్నివిధాల బీజేపీ సాయం చేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రాభివృద్ధికి మిత్రపక్షంగా పూర్తి సహాయసహకారాలు అందిస్తున్నామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సాయం చేస్తుందని ఆయన చెప్పారు. ఈ లేఖపై తనకు పూర్తి సమాచారం లేదని, సమాచారం వచ్చిన తరువాత స్పందించడం న్యాయమని ఆయన చెప్పారు. 
Andhra Pradesh
polavaram
Chandrababu
somu veerraju

More Telugu News