vidyabalan: నేనింతే .. ఇలాగే వుంటాను .. మీకేంటి బాధ: విద్యాబాలన్

  • మొదటి నుంచి నేను బొద్దుగానే వుంటాను 
  • నా శరీర తత్వమే అంత 
  • నా నటన గురించి మాట్లాడండి .. శరీరాకృతిని గురించి కాదు
  • నేను సన్నబడటమంటూ జరగదు    
కొంతకాలం క్రితం వరకూ గ్లామర్ పాత్రలతో హుషారెత్తించిన విద్యాబాలన్, ఆ తరువాత నటనకి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకువెళుతోంది. ఆ తరహా పాత్రలను ఆమెతో చేయించడానికే దర్శక నిర్మాతలు కూడా ఆసక్తిని చూపుతున్నారు. అలాంటి విద్యాబాలన్ .. తాను లావుగా వున్నానంటూ కొంతమంది చేసిన కామెంట్ల పట్ల తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేసింది.

" మొదటి నుంచి కూడా నేను బొద్దుగానే వుంటాను .. నా శరీర తత్వమే అంత. నేను చేసిన పాత్రలను గురించి .. నా నటన గురించి మాట్లాడండి. అంతేగాని నా శరీరాకృతి గురించి మాట్లాడతారెందుకు? నా నిర్మాతలకి లేని బాధ .. నా అభిమానులకు లేని ఇబ్బంది మీకెందుకు?. నేను సన్నబడటమనేది జరగదు .. కాబట్టి నేను లావుగా వున్నానంటూ చేసే కామెంట్ల వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. లావుగా వున్నవారిపై సినిమాల్లో కామెడీ చేయడం కూడా నాకు నచ్చదు" అంటూ స్పష్టం చేసింది. విద్యాబాలన్ లావుగా ఉందని ఎవరు ఎవరితో అన్నారో గానీ, మొత్తానికి వాళ్లనిలా దులిపేసింది.   
vidyabalan

More Telugu News