jc divakar reddy: అన్న‌ చేసిన పొరపాటు పవన్ కల్యాణ్ కి మైనస్ అవుతుంది!: జేసీ దివాక‌ర్ రెడ్డి

  • పార్టీని విలీనం చేసి చిరంజీవి తప్పు చేశారు
  • అన్న చేసిన త‌ప్పు త‌మ్ముడికి మైన‌స్ పాయింట్‌
  • ప‌వ‌న్ క‌ష్ట‌ప‌డి సినిమాల్లో ఎదిగారు
  • పార్టీని స్థాపించ‌డం విత్త‌నాలు వేయ‌డం లాంటిది.. పండించాలి
జనసేన అధినేత, సినీన‌టుడు పవన్ కల్యాణ్ కు తన సోదరుడు చిరంజీవి పెద్ద శాపంగా మారార‌ని అనంతపురం ఎంపీ, టీడీపీ నేత‌ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ రోజు అమరావతిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని, అదే చిరంజీవి చేసిన‌ పెద్ద పొరపాటని అన్నారు. అన్న‌ చేసిన పొరపాటు త‌మ్ముడికి మైనస్ అని చెప్పుకొచ్చారు. ప‌వ‌న్ చాలా కష్టపడి సినిమాల్లో మంచి పేరు సంపాదించుకున్నారని, అయితే జనసేన పార్టీ స్థాపించ‌డం విత్తనాలు వేయ‌డం లాంటిద‌ని, పంట కూడా బాగా పండాలని ఆయ‌న అన్నారు.  
jc divakar reddy
Chiranjeevi
Pawan Kalyan

More Telugu News