KTR: కేటీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన పరుచూరి గోపాలకృష్ణ

  • ఇన్నాళ్లు పోరాట యోధునిగా, యువ నేతగానే తెలుసు
  • ఇప్పుడు విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు
  • మీ భాషణం అనితరసాధ్యం
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసల జల్లు కురిపించారు. జీఈఎస్ సదస్సులో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ సమన్వయకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. తన మాటతీరుతో ఇవాంకాతోపాటు అక్కడున్న ఆహూతులందరినీ కేటీఆర్ మైమరిపించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తారు గోపాలకృష్ణ.

"కేటీఆర్ గారు, ఇన్నాళ్లు రాజకీయ పోరాట యోధునిగా, యువ నేతగానే తెలిసిన మీరు... నిన్నటి జీఈఎస్ సదస్సులో విశ్వవిజ్ఞానఖనిలా కనిపించారు. అభినందనలు. మీ భాషణం అనితరసాధ్యం", అంటూ పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్ చేశారు.
KTR
paruchuri gopalakrishna
tollywood

More Telugu News